VIDEO: కుష్ణపల్లిలో పులుల సంచారం.. డప్పు చాటింపు

VIDEO: కుష్ణపల్లిలో పులుల సంచారం.. డప్పు చాటింపు

ASF: బెజ్జూర్ మండలం కుష్ణపల్లిలో పులుల సంచారం దృష్ట్యా అటవీ శాఖ అధికారులు సోమవారం డప్పు చాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. పులులు తిరుగుతున్న నేపథ్యంలో అటవీ పరిసరాల్లోని పత్తి చేను రైతులు పొలాల్లోకి ఒంటరిగా వెళ్లకూడదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పశువుల కాపర్లు సైతం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా పులులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.