కొబ్బరి ముక్కల సేకరణకు వేలంపాట
MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో గల రామప్ప దేవస్థానము నందు కొబ్బరి మొక్కల పోగు ( సేకరణకు) బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. 4 జనవరి 2026 నుంచి, 3 జనవరి 2027 వరకు దేవస్థానము ఆవరణంలో పోగు చేసుకోవచ్చని అన్నారు. పాటలో పాల్గొనదలచిన వారు రూ.50వేల ధరావతు సొమ్ము చెల్లించి ఈ నెల 9 న జరిగే వేలంపాటలో పాల్గొనవచ్చు అన్నారు.