'అభివృద్ధికి అందరూ సహకరించాలి'
MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి జక్కు సుష్మ భూమేష్, మాజీ సర్పంచ్ జక్కు భూమేష్ కోరారు. ఆదివారం గ్రామంలోని పలు కాలనీలలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.