'శంకర్ గౌడ్ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి'

'శంకర్ గౌడ్ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి'

WGL: నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. RTC ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు కార్మికులు తెలిపారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇకపై ఆలస్యం చేయకుండా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.