VIDEO: రూ.1 స్క్రీన్ గార్డ్.. పోటెత్తిన జనం
KRNL: పత్తికొండలోని ఓ మొబైల్ దుకాణం వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా రూ.100కు అమ్మే స్క్రీన్ గార్డ్‌ను ఇవాళ కేవలం రూ.1కే అందించడంతో జనం భారీగా తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వందలాది మంది చేరుకుని షాప్ వద్ద బారులు తీరారు. ఆఫర్‌తో దుకాణం వినియోగదారులతో కిక్కిరిసిపోయింది.