నిలిచిన మురుగునీరు.. స్థానికుల ఇబ్బందులు

నిలిచిన మురుగునీరు.. స్థానికుల ఇబ్బందులు

KDP: సిద్ధవటం మండలం సంటిగారి పల్లి ఎస్సీ కాలనీలో మురుగునీరు రోడ్డుపై చేరడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. నీటి నిల్వతో దోమలు విపరీతంగా చేరి, విష జ్వరాలు సోకే అవకాశం ఉందన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, రహదారుల్లో నిలువ ఉన్న మురుగు నీటిని తొలగింపు చర్యలు చేపట్టి దోమల బెడద నుంచి కాపాడాలని ఎస్సీ కాలనీ వాసులు కోరారు.