పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు

KMR: రామారెడ్డి మండలం పోసానీపేట్‌లో ఆదివారం 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' 99 రోజులు కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సుద్దాల లింగం ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురికి మందులు పంపిణీ చేశారు. అనంతరం వారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంజయ్య ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ కళావతి, పోతుల లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.