లక్కవరం గ్రామానికి చెందిన కృష్ణంరాజుకు కీలక పదవి

లక్కవరం గ్రామానికి చెందిన కృష్ణంరాజుకు కీలక పదవి

కోనసీమ: రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి వేణుగోపాల కృష్ణంరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదేశాలు వెలువడ్డాయని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మందిని ఈ పదవిలో నియమించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.