కోడి పందాల శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్

కోడి పందాల శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలోని కొండపర్వ శివారు ప్రాంతాల్లో ఆదివారం కోడిపందాల శిబిరాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, 11 ద్విచక్రవాహనాలు, 5 కోళ్లు, 2 కోడి కత్తులు, రూ. 16,800ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అర్జున్ రాజు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.