‘నాటోను 'కాగితం పులి' అన్నందుకు తగిన శాస్తి’
ఇరాన్‌ను తక్కువ అంచనా వేసి ట్రంప్ తప్పు చేశారని CIA మాజీ అధిపతి పనెట్టా అన్నారు. గతంలో నాటోను 'కాగితం పులి' అని హేళన చేసిన ట్రంప్‌కు ఇప్పుడు ఏ దేశం మద్దతు ఇవ్వట్లేదన్నారు. మరోవైపు మొజ్తాబా ఖమేనీ రాకతో ఇరాన్ కఠినంగా మారిందన్నారు. హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేస్తే ప్రపంచ ఇంధన రవాణా స్తంభిస్తుందని, ఆ ప్రమాదాన్ని ట్రంప్ పూర్తిగా విస్మరించారని పనెట్టా విమర్శించారు.