VIDEO: గుంతల మయమైన రోడ్డు..... ఇబ్బందుల్లో ప్రయాణికులు

KNR:సైదాపూర్ నుంచి మొలంగూర్ వెళ్లే రోడ్డులోని SRSP కెనాల్ సమీపంలో ఏర్పడ్డ గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు ప్రమాద భయంతో ఆందోళన చెందుతున్నారు. స్థానికులు, వాహనదారులు ఈ గుంతలను తక్షణం మరమ్మత్తులు చేయాలని అధికారులను కోరుతున్నారు. రోడ్డు నాణ్యతను మెరుగుపరచి, భద్రతను కచ్చితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.