'రేపు 5,074 మంది సిబ్బందితో పింఛన్ల పంపిణీ'

'రేపు 5,074 మంది సిబ్బందితో పింఛన్ల పంపిణీ'

ELR: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని నవంబర్ 1 ఉదయం 7 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం తెలిపారు. 5,074 మంది సచివాలయ సిబ్బందితో ఈ పంపిణీ జరుగుతుందన్నారు. అక్టోబర్ నెల పింఛను చెల్లింపులు నవంబర్ 1న జరుగుతాయని, ఈ నెలలో 2,60,036 మందికి రూ. 113.72 కోట్లు పంపిణీ చేశామన్నారు. 1న తీసుకోని వారికి 3న అందజేస్తామన్నారు.