అటవీ శాఖ అధికారులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

KRNL: శ్రీశైల శిఖరం సమీపంలో నిన్న రాత్రి అటవీ శాఖ అధికారులపై MLA బుడ్డా రాజశేఖర రెడ్డి అనుచరులు చేసిన దాడి ఘటన కలకలం రేపుతోంది. విధుల్లో ఉన్న ఉప అటవీ, బీట్ అధికారులను బంధించి దాడి చేశారని అటవీ అధికారులు విలేకరుల సమావేశంలో తెలిపారు. అధికారులు తీవ్రంగా గాయపడ్డారని, వాకీటాకీలు, ఫోన్లు లాక్కున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కోరారు.