వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలని ఎమ్మెల్యేకు వినతి
SRPT: వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆదివారం కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డికి వడ్డెర సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోగుల లక్ష్మయ్య వినతి పత్రం అందజేశారు. వడ్డెరల సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు.