జిల్లా కలెక్టర్‌పై కేసు నమోదు

MHBD: జిల్లాలో యూరియా కోసం లైన్‌లో నిలబడిన వృద్ధ రైతు అజ్మీరా లక్య తొక్కిసలాటలో గాయపడిన ఘటన పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పై మంగళవారం కేసు నమోదు చేసింది. ఈ అంశాన్ని మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటన పై కమిషన్ తీవ్రంగా మండిపడింది.