VIDEO: ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
KMR: సదాశివనగర్ మండలం మల్లుపేట శివారులో 44వ జాతీయ రహదారిపై శనివారం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. కల్వరాల్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం రంజాన్ పండుగ కోసం జిల్లా కేంద్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులకు గాయాలు కాగా, వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.