పోలవరం మట్టి నమూనాలు సేకరించిన నిపుణుల బృందం

W.G: సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం బుధవారం పోలవరం ప్రాజెక్ట్, స్పిల్‌వేతో పాటు పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మట్టి నమూనాలు సేకరించి పరీక్షించారు. నిపుణులు అందచేసే మట్టి నాణ్యత పరీక్షల నివేదిక ఆధారంగా నిర్మాణాల్లో మట్టిని అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామని అధికారులు తెలిపారు.