కుక్కల బెడద తీరేదెన్నడో..

కుక్కల బెడద తీరేదెన్నడో..

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో శునకాల బెడద అధికమైంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తూ.. దైనందిన పనులపై బయటకు వచ్చేవారు భయపడుతున్న సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. చికెన్, మటన్ సెంటర్లు,హోటళ్ల సంఖ్య పెరిగి పుష్కలంగా ఆహారం దొరుకుతుండడంతో వీధి కుక్కల సంఖ్య కూడా ఇటీవల విపరీతంగా పెరిగింది. కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు అధికారులను  కోరుతున్నారు.