చౌటుప్పల్ సమీపంలో భారీగా మద్యం పట్టివేత
BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం జాతీయ రహదారిపై ఎన్నికల వేళ అక్రమంగా తరలిస్తున్న రూ. 70 వేల విలువైన మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.