VIDEO: పంట కాలువ నీరు మళ్లింపుపై రైతుల ఆందోళన
కోనసీమ: కాట్రేనికోన మండలంలో ఉన్న బొబ్బర్లంక -పల్లంకుర్రు ప్రధాన పంట కాలువలో నీటిని ఇంజిన్లు పెట్టి ట్యాంకర్ల ద్వారా చిర్ర యానం యాచరీకి తరలిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల శివారు భూములకు నీరు అందక ఎండిపోతున్నాయని అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి మళ్లింపులు అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు.