రూ.90 లక్షలతో నూతన సీసీ రోడ్ల పనులు ప్రారంభం
BPT: చీరాల నియోజకవర్గంలోని చెల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలో రూ.90 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు.