ఎస్సీ కార్పొరేషన్ రుణాలు.. రేపే చివరి తేదీ
SRD: ఎస్సీ నిరుద్యోగ యువతకు సబ్సిడీ రుణాల దరఖాస్తు గడువు ఈనెల 8వ తేదీతో ముగియనుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామాచారి తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అర్హులైన ఉమ్మడి జిల్లా ఎస్సీ యువతీ యువకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎంపీడీవో లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని తెలిపారు.