VIDEO: మహిళా సంఘం ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు
KNR: జిల్లాలో భట్రాజు మహిళా సంఘం సేవ కో-ఆర్డినేటర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి రాందాస్ భక్తమండలి తీసుకువచ్చిన వడ్లతో కోటి గోటి తలంబ్రాల సేవా కార్యక్రమం చేపట్టారు. మహిళలంతా కలిసి గోటితో తలంబ్రాలను ఒలిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 70 ఏళ్లు దాటిన మహిళలను సన్మానించారు. మహిళా సంఘ అధ్యక్షురాలు స్వరూపరాణి, కార్యదర్శి, మహిళలు పాల్గొన్నారు.