ఎంఎన్ఆర్ నగర్ సమస్యలపై సీపీఎం పాదయాత్ర

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులోని ఎమ్మెన్నార్ నగర్‌లో నేడు సీపీఎం పార్టీ కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యలపై సర్వే నిర్వహించారు. మండల పార్టీ కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఎంఎన్ఆర్ నగర్ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో చంటి రవి, జంపాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.