పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

కృష్ణా: విజయవాడ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే 132 రైళ్లు రద్దు చేశారు. మరో 93 రైళ్లను దారి మళ్లించారు. తాత్కాలికంగా 9 రైళ్లను రద్దు చేయగా, కొండపల్లి, రాయనపాడులో రైలు పట్టాలపై వరద ఉండటంతో ట్రాక్‌పైనే మూడు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులను 40 ప్రత్యేక బస్సుల్లో విజయవాడకు తరలించారు. ఇక్కడ నుంచి ప్రత్యేక రైళ్లలో వారిని గమ్యస్థానాలకు రైల్వేశాఖ పంపించింది.