పాల వెంకటాపురం వద్ద తప్పిన అగ్నిప్రమాదం

పాల వెంకటాపురం వద్ద తప్పిన అగ్నిప్రమాదం

ATP: బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురంలో రైతు అమ్రేష్, జానప్ప, సీనప్ప పొలం వద్ద ప్రమాదవశాత్తు శుక్రవారం నిప్పు అంటుకుంది. ఎండల తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించాయి. గ్రామస్తులు తక్షణమే స్పందించి నీటి ట్యాంకర్‌ను తెప్పించి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. పంట పొలాలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు.