గోశాలను సందర్శించిన కలెక్టర్
NTR: వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలోని సాయి శ్రీనివాస్ గోశాలను కలెక్టర్ లక్ష్మీశ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గోశాలను నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. స్వదేశీ ఆవు జాతుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాల రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుపోషకులు, అధికారులు పాల్గొన్నారు.