తెనాలిలో ఉచిత టైలరింగ్ శిక్షణ ప్రారంభం
GNTR: తెనాలి కొత్తపేట మెప్మా భవన్‌లో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మహిళలు సొంత కాళ్లపై నిలబడేందుకు, ఆర్థికంగా ఎదగడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు