చెత్త రికార్డ్.. అఫ్రిదిని దాటేసిన బాబర్
జింబాబ్వేతో T20లో డకౌట్‌గా వెనుదిరిగిన పాక్ ప్లేయర్ బాబర్ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. T20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన పాక్ ప్లేయర్‌గా షాహిద్ అఫ్రిది(8)ని దాటేసి 2వ స్థానంలో నిలిచాడు. బాబర్ ఇప్పటివరకు 9 సార్లు డకౌట్ కాగా ఈ లిస్టులో సైమ్ అయూబ్, ఉమర్ అక్మల్(10) అగ్రస్థానంలో ఉన్నారు. ఓవరాల్‌గా లంక ప్లేయర్ షనక(14) టాప్‌లో ఉన్నాడు.