ఏకగ్రీవ సర్పంచ్‌ను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి
NLG: తిప్పర్తి మండలం కంకణాలపల్లి గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పాశం సునంద సంపత్ రెడ్డి ఇవాళ నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా గ్రామాభివృద్ధికి పాటుపడాలని మంత్రి ఆమెకు సూచించారు.