తెనాలిలో ప్రశాంతంగా హిందీ పరీక్షలు

GNTR: తెనాలిలో దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన హిందీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కొత్తపేటలో గల రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్‌లో ప్రథమ, మధ్యమ, రాష్ట్ర భాష, ప్రవేశిక ప్రిలిమినరీ పరీక్షలను ఉదయం నుంచి నిర్వహించారు. ఈ కేంద్రంలో 230 మంది విద్యార్థులు హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.