గురజాలలో రెవెన్యూ సమస్యలపై యరపతినేని దృష్టి
PLD: గురజాల నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించనున్నట్లు సోమవారం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గంలో భూ సమస్యలపై తమకు అత్యధిక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. త్వరలో మండలాల వారీగా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రెవెన్యూ సిబ్బందితో కలిసి నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.