నేడు సీతారామచంద్రస్వామికి తిరుకళ్యాణ మహోత్సవం

నేడు సీతారామచంద్రస్వామికి తిరుకళ్యాణ మహోత్సవం

నల్గొండ పట్టణంలోని రామగిరి సీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ తరపున జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.