చిరు, బాలయ్య కాంబో.. దర్శకుడు ఏమన్నారంటే?

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కాంబో కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. అవకాశం వస్తే బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చిరు గతంలో చెప్పారని తెలిపారు. వారిద్దరివి డిఫరెంట్ మ్యానరిజమ్స్ అని, వారికి సెట్ అయ్యే కథ రావాలని వెల్లడించారు. అలాంటి కథ దొరికితే అప్పుడు చూద్దామని పేర్కొన్నారు.