'వైర్ల చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
అన్నమయ్య: తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెరుగుతున్న కేబుల్ వైర్ల చోరీలు, నగల మోసాల పట్ల ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని SI అనిల్ కుమార్ మంగళవారం సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గస్తీ పెంచామని, షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.