VIDEO: వాడపల్లి వెంకన్నకు భారీ ఆదాయం
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం భారీ ఆదాయం వచ్చింది. ప్రత్యేక, విశిష్ట దర్శనాలు, వేద ఆశీర్వచనాలు, ప్రసాదాల విక్రయం, విరాళాల ద్వారా ఆలయానికి మొత్తం రూ.72.11 లక్షల ఆదాయం లభించిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు తెలిపారు. సుమారు 1,13,805 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు.