పరిగిలో యాక్సిడెంట్ .. వ్యక్తికి తీవ్ర గాయాలు
VKB: పరిగి పట్టణంలోని విజేత హాస్పిటల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడ్స్ ఆటో బైకును ఢీ కొట్టడంతో బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.