లా సెట్‌పై 18న అవగాహన సదస్సు

కడప: జనవిజ్ఞానవేదిక(జేవీవీ), ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో లా సెట్‌పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జేవీవీ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు శివారెడ్డి, సునీతలు తెలిపారు. ఈ నెల 18న ప్రొద్దుటూరు పట్టణంలోని జేవీవీ కార్యాలయంలో ఉచితంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. లాసెట్ అభ్యర్ధులు సదస్సుకు హాజరై నిపుణుల సూచనలు తీసుకోవాలన్నారు.