నేను చేసిన సేవకు ఫలితం ఇదా: బత్యాల చెంగల్ రాయులు

నేను చేసిన సేవకు ఫలితం ఇదా: బత్యాల చెంగల్ రాయులు

కడప: పార్టీ కోసం పనిచేసిన నాకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించకుండా.. పొత్తులో భాగంగా సుగవాసుకి ఎంపీ సీటు గల్లంతయిందని.. నా సీటును కేటాయించడం ఎంతవరకు సబబని రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ బత్యాల చెంగల్ రాయులు శనివారం అన్నారు. నేను చేసిన సేవకు ఫలితం ఇదా.. అని అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. బంగారం కిరీటం పెట్టినా వద్దని నాకు ఎమ్మెల్యే టికెట్ మాత్రమే కావాలి అని తెలిపారు.