సామాన్య కుటుంబం నుంచి ఎక్సైజ్ ఎస్సైగా రమణమ్మ
SKLM: ఎపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఎచ్చెర్ల మండలం కొత్త కూర్మినాయుడు పేటకు చెందిన జీరు రమణమ్మ ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. కూలీలైన తల్లిదండ్రుల సహకారంతో చదువుకుని, ప్రస్తుతం పొందూరు మండలం గోరంటిలో పంచాయతీ సెక్రెటరీగా పనిచేస్తూనే ఈ విజయం సాధించారు. సామాన్య కుటుంబం నుంచి ఉన్నత ఉద్యోగం సాధించడంతో గ్రామ పెద్దలు ఆమెను ఘనంగా అభినందించారు.