నగర సుందరీకరణే లక్ష్యం: కేంద్ర మంత్రి
శ్రీకాకుళం నగర సుందరీకరణే లక్ష్యం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన గురువారం సాయంత్రం శ్రీకాకుళంలో పర్యటించారు. సీఎం చంద్రబాబు సంకల్పించిన 'స్వర్ణాంధ్ర ప్రదేశ్' లక్ష్య సాధనలో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, నగరంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.