ముంబై, లక్నో జట్ల మధ్య ట్రేడ్ డీల్..?
ఐపీఎల్-2026 ఎడిషన్ కోసం జరగనున్న మినీ వేలం ముందు మరో ట్రేడ్ డీల్ అప్‌డేట్ వచ్చింది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ట్రేడ్ డీల్ జరగనున్నట్లు సమాచారం. ముంబై నుంచి అర్జున్ టెండూల్కర్ లక్నో జట్టులోకి వెళ్తుండగా, శార్దూల్ ఠాకూర్ ముంబై జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈనెల 15లోపు రిటైన్డ్ ఆటగాళ్ల జాబితాలను ఫ్రాంచైజీలు ప్రకటించాల్సి ఉంది.