నెల్లూరులో కార్మికుల నిరసన

నెల్లూరు: సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని లేబర్ ఆఫీస్ వద్ద గురువారం భవన నిర్మాణ కార్మికులు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద నుంచి లేబర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. అలాగే కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.