బస్సులు లేక విద్యార్థుల అగచాట్లు
SKLM: ఎల్.ఎన్.పేట మండల కేంద్రంలో సుమారు 300 మందికి పైగా విద్యార్థులు శ్రీకాకుళం వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల, కళాశాలల ప్రారంభసమయానికి బస్సుల సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళల్లో బస్సులు అందుబాటులో లేక, ఒకే బస్సుపై ఆధారపడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.