స్వాతంత్ర సమరయోధుడి వర్ధంతి

స్వాతంత్ర సమరయోధుడి వర్ధంతి

W.G: ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భూపతిరాజు సుబ్బరాజు వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం తణుకులో నిర్వహించారు. బ్యాంకు కాలనీలో స్వాతంత్ర సమరయోధుల పార్కు వద్ద సుబ్బరాజు విగ్రహానికి ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన గొప్ప కమ్యూనిస్టు అని కొనియాడారు.