పెద్దపులి సంచారం.. బంధించేందుకు రానున్న బృందం
AP: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం పాండవుల కొండపైన పెద్దపులి సంచారిస్తోంది. రాత్రి 11 గంటల సమయంలో పెద్దపులి కిందకు దిగింది. చెరువులో నీరు తాగి మళ్లీ కొండెక్కినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కోరుకొండ, కాపవరం, మునగాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులిని బంధించేందుకు పుణె నుంచి నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నారు.