VIDEO: జాతీయ రహదారిపై తనిఖీలు
NZB: ముప్కాల్ శివారులోని పాత జాతీయ రహదారిపై ఎస్సై రజినీకాంత్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అన్ని రకాల డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని ఎస్సై సూచించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.