KCR పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. ఈ పిటిషన్‌కు కోర్టు నంబర్ కూడా కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్‌ను కూడా.. KCR పిటిషన్‌తో కలిపి హైకోర్టు విచారించనుంది.