సీపీని కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్

NZB: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సాయి చైతన్యను ఎంపీ అరవింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతలు, ఇతర పలు అంశాల గురించి చర్చించారు. ఎంపీతో పాటు, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ పాల్గొన్నారు.