దత్త జయంతి సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు
ELR: ఉంగుటూరు మండలం కాగుపాడులో దత్త జయంతి సందర్భంగా గురువారం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ది చేబ్రోలు సొసైటీ ఛైర్మన్ కడియాల రవిశంకర్ ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన జరిగింది. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రెడ్డిచందు, అక్కిన శేషు పాల్గొన్నారు.